రాష్ట్రపతి భవన్‌లో అనుమానాస్పద జంతువు సంచారం సంచలనంగా మారింది! జూన్ 9, ఆదివారం కేంద్ర మంత్రులు ప్రమాణం చేస్తున్న సమయంలో వెనుకవైపు ఓ జంతువు అటు వైపు వెళ్తూ కనిపించింది. చిరుతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి! 😲 రాష్ట్రపతి భవన్‌లో చిరుతలను పెంచుతారా? సోషల్ మీడియా కామెంట్లు, ఊహాగానాలు జోరుగా ఉన్నాయి. అయితే, రాష్ట్రపతి భవన్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
కేంద్రమంత్రిగా దుర్గా దాస్ ప్రమాణం చేసిన అనంతరం రిజిస్టర్‌లో సంతకం చేస్తుండగా బ్యాగ్రౌండ్‌లో రాష్ట్రపతి భవన్ మెట్ల పైన ఓ జంతువు అటుగా వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో వైరల్‌గా మారింది. చూసిన వాళ్లంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో చిరుతలను పెంచుతారా? ఆ అవకాశం ఉందా అని రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ వీడియోలో కనిపించింది చిరుతేనా? లేక శునకమా? లేదా ఏదైనా పిల్లా? ఇలా రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఇలా వచ్చి అలా వెళ్లిన జంతువు అందరికీ పరీక్ష పెట్టింది. 🐆🤷♂️