top of page
Suresh D

🎭🤣🌟 అంజిగాడి అల్లరితో ‘సామిరంగ’ సంబరం

'అల్లరి' నరేష్ ఓ ఇమేజ్ ఛట్రంలో బందీ కానీ నటుడు. ఆయన కామెడీ ఎంత బాగా చేయగలరో... సీరియస్ రోల్స్ కూడా అంతే బాగా చేస్తారు. అందుకు 'శంభో శివ శంభో', 'నాంది', 'ఉగ్రం' సినిమాలే మంచి ఉదాహరణలు. కామెడీ ఫిలిమ్స్ పక్కన పెట్టిన 'అల్లరి' నరేష్... కొన్ని సినిమాలుగా సీరియస్ రోల్స్ చేస్తున్నారు. మళ్ళీ ఆయన వినోదాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు అక్కినేని నాగార్జున. కింగ్ నాగార్జున అక్కినేని కథానాయకుడిగా రూపొందుతోన్న సినిమా 'నా సామి రంగ'. ప్రముఖ నృత్య దర్శకుడు విజయ్ బిన్ని దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ అధినేత, ప్రముఖ నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. భారీ నిర్మాణ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. పవన్ కుమార్ చిత్ర సమర్పకులు. ఈ సినిమాలో 'అల్లరి' నరేష్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇవాళ ఆయన క్యారెక్టర్ ఇంట్లో గ్లింప్స్ విడుదల చేశారు.



bottom of page