అక్కినేని నాగచైతన్య చందూ మొండేటి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ తండేల్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది.
అక్కినేని నాగచైతన్య చందూ మొండేటి కాంబోలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ తండేల్ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే తాజాగా ఈ సస్పెన్స్ కు తెరపడింది. నాగ చైతన్యతో మళ్లీ నటించేందుకు సాయి పల్లవి రెడీ అయింది.
ఏది ఏమైనా కూడా ఇన్నాళ్లకు మళ్లీ సాయి పల్లవి ఓ తెలుగు సినిమాను ఒప్పుకోవడంతే ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అది కూడా మళ్లీ నాగ చైతన్యతో జోడి కట్టడంతో ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఈ చిత్రం శ్రీకాకుళం ఏరియా నుంచి పాకిస్థాన్‌లోకి వెళ్లిన జాలర్ల కథ అని, యదార్థ ఘటన ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది.తాజాగా సాయి పల్లవి గురించి టీం ఓ పోస్ట్ వేసింది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోందని ప్రకటించారు. నిన్న జరిగిన మీటింగ్ నుంచి కొన్ని ఫోటోలను షేర్ చేశారు.