top of page

నాగచైతన్య, శోభిత 2027లో విడిపోతారు : వేణుస్వామి

MediaFx

ప్రముఖ జోతిష్యుడు వేణు స్వామి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఆయన సెల‌బ్రిటీల‌ జాతకం చెబుతూ.. ఆయన కూడా ఓ సెల‌బ్రిటీ అయిపోయాడు. అయితే ఈ మ‌ధ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ గెలుస్తాడ‌ని చెప్పి బొక్కబోర్లా పడ్డాడు. దీంతో ఆయ‌న‌పై విప‌రీతంగా ట్రోల్స్ వ‌చ్చాయి. ఇక ట్రోల్స్‌ని త‌ట్టుకోలేని వేణుస్వామి ఇక‌పై తాను ఎవ‌రి జాత‌కం చెప్ప‌న‌ని ప్ర‌క‌టించాడు. దీంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింది. అయితే తాజాగా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జంట‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు వేణుస్వామి నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల జాత‌కం క‌ల‌వ‌లేద‌ని అలాగే వాళ్లిద్ద‌రు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న స‌మ‌యం క‌రెక్ట్ కాద‌ని వేణు స్వామి వెల్ల‌డించాడు. నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి చేసుకున్న అనంత‌రం ఒక అమ్మాయి వ‌ల‌న 2027లో విడిపోతార‌ని ప్ర‌క‌టించాడు. అయితే వారిద్ద‌రూ క‌లిసి ఉండాలని తన జోతిష్యం త‌ప్పుకావ‌ల‌ని వేడుకుంటున్న‌ట్లు వేణు స్వామి తెలిపాడు. అయితే వేణు స్వామిపై మళ్లీ ట్రోల్స్ స్టార్ట్ చేశారు నెటిజ‌న్లు. శుభమా అని ఆ జంట ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇలాంటి అశుభ మాటలెందుకండి?. అసలు వారి జాతకం చెప్పమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ప్రైవేట్ వ్యక్తుల జీవితాల్లోకి ఎందుకు చొరబడుతున్నారు? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.



bottom of page