అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, నటి సమంత రూత్ ప్రభు విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరూ తమతమ కెరీర్ లో బిజీగా మారిపోయారు. నాగ చైతన్య వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కానీ సమంత మాయోసైటిస్ తో బాధపడుతూ, కోలుకోవడానికి సినిమాలకు ఏడాది పాటు బ్రేక్ ఇచ్చింది. త్వరలోనే సామ్ తిరిగి సినిమాలతో బిజీ కావాలని చూస్తుంది.
ఇదిలా ఉండగా, విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య జీవితంలో మరో అమ్మాయి వచ్చిందని టాక్ వినిపిస్తుంది. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళతో రిలేషన్ లో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరూ కలిసి వెకేషన్స్ కు వెళ్తున్నారని టాక్ వినిపిస్తుంది.
ఇటీవలే శోభిత ధూళిపాళ, నాగ చైతన్య కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తాజా ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. కానీ ఇంతవరకు తమ రిలేషన్ షిప్ గురించి ఎక్కడా మాట్లాడలేదు.
శోభిత ధూళిపాళ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం సినిమాల్లో నటించింది. సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత, శోభిత తో నాగ చైతన్య లవ్ లో ఉన్నాడని అంటున్నారు. వీరిద్దరూ కలిసి విదేశీ హోటళ్లలో గడిపినట్లు కొన్ని ఫోటోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.