సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి కొత్త ప్రమాణాలకు తెర తీసింది.
"బిగ్ బాస్ సీజన్ 7" ఊహించినట్టుగానే ఎన్నో సంచలనాలు సృష్టించింది. 📺 రేటింగ్స్ పరంగా, వ్యూయర్ షిప్ పరంగా ఊహించని ఎన్నో అద్భుతాలకు "బిగ్ బాస్ సీజన్ 7" వేదిక అయింది. 🔥 సీజన్ సీజన్ కీ అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్ కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి కొత్త ప్రమాణాలకు తెర తీసింది.ఈ సీజన్ లో బిగ్ బాస్ షోకి అదిరిపోయే టీఆర్పీ రేటింగ్ వచ్చినట్లు స్టార్ మా ఛానల్ గురువారం (సెప్టెంబరు 14) న వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ తిరగరాసినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 📱 ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రియాల్టీ షో రికార్డులను తెలుగు బిగ్ బాస్ తిరగరాసింది. సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది వీక్షించారు. 💥