ధనుష్ పాన్ ఇండియా మూవీలోకి కింగ్ నాగార్జున..🎞️💫
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది.

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించనుంది. #D51 అనే వర్కింగ్ టైటిల్ తో ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే ఈ మూవీలో నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. వీటిని నిజం చేస్తూ 'పవర్ ఫుల్ ప్రాజెక్ట్ కి పవర్ హౌస్ అదనంగా వచ్చి చేరింది' అంటూ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసారు.
''ధనుష్ - శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందే మా పాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం మాకు ఒక పవర్ హౌస్ అవసరం అయింది. దానికి మా ఓన్ 'కింగ్' కంటే బెటర్ ఇంకెవరు ఉన్నారు. మరోసారి మీతో కలిసి పని చేయడానికి మేము చాలా సంతోషిస్తున్నాము. మీరు ఈ సినిమాలో భాగమవుతుండం మాకు గౌరవంగా భావిస్తున్నాం. ఈ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వేచి ఉండలేకపోతున్నాం. హ్యాపీ బర్త్ డే కింగ్ అక్కినేని నాగార్జున'' అని D51 మేకర్స్ ప్రకటనలో పేర్కొన్నారు.