‘నా సామిరంగ’ అంటూ బరిలో నాగ్..🎥🎞️
- Suresh D
- Aug 29, 2023
- 1 min read
నాగార్జున తన 99వ సినిమా అప్డేట్‌ను బర్త్ డే స్పెషల్‌గా ఇచ్చాడు. అక్కినేని అభిమానులకు పండుగలా ఉంది ఈ అప్డేట్. నా సామి రంగ అంటూ టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున కట్టూ, మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలీష్‌గా ఉన్నాయి.
నాగార్జున తన 99వ సినిమా అప్డేట్‌ను బర్త్ డే స్పెషల్‌గా ఇచ్చాడు. అక్కినేని అభిమానులకు పండుగలా ఉంది ఈ అప్డేట్. నా సామి రంగ అంటూ టైటిల్, గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగార్జున కట్టూ, మాట తీరు, యాక్షన్ సీక్వెన్సులు అన్నీ కొత్తగా, స్టైలీష్‌గా ఉన్నాయి. ఇక ఈ పండుక్కి నా సామి రంగా అంటూ చివర్లో నాగార్జున చెప్పిన డైలాగ్ అదిరిపోయిందంతే. ప్రస్తుతం ఈ గ్లింప్స్ తెగ వైరల్ అవుతోంది.వరుస ఫ్లాపులతో అక్కినేని హీరోలు సతమతం అవుతున్నారు. నాగ చైతన్య, అఖిల్‌లు డిజాస్టర్ల మీద డిజాస్టర్లు ఇస్తున్నారు. ఇక నాగార్జున కూడా ఫాం కోల్పోయాడని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో ఈ నా సామి రంగ అప్డేట్ అక్కినేని అభిమానులకు ఊపిరినిచ్చేలానే ఉంది. పలాస దర్శకుడు కరుణ కుమార్ ఈ సినిమాలో విలన్‌గా కనిపిస్తుండటం విశేషం.🎥🎞️