top of page
MediaFx

నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..వీడియో చూస్తే మైమరచిపోతారంతే


నాగార్జునసాగర్ వైపు కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతుండటంతో… సాగర్ రిజర్వాయర్ నిండుకుండలా మారింది.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ కు భారీగా ఇన్ ఫ్లో రావడంతో నీటిమట్టం గణనీయంగా పెరిగింది.. దీంతో సాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు ఎత్తారు.. నాగార్జునసాగర్‌కు భారీగా వరద వస్తున్న నేపథ్యంలో మొదట ఆరు గేట్లను ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది.. నాగర్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణ బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయ్‌.. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ , జూరాల, తుంగభద్ర, శ్రీశైలం.. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అక్కడి నుంచి వరదంతా ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వచ్చి చేరుతోంది. దీంతో.. 2 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. చివరి సారిగా.. 2022 ఆగస్ట్‌ 11 న క్రస్ట్‌గేట్లను ఎత్తారు.. అప్పుడు గేట్లను ఎత్తిన తర్వాత మళ్లీ ఈ రేంజ్‌లో నీళ్లు ప్రాజెక్టులో కనిపించలేదు. వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. ఈ సారి వర్షాలు కురవడం, ఎగువనుంచి వరదనీరు పోటెత్తడంతో, అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాగర్‌ ప్రాజెక్టులో సరిగ్గా ఉదయం 11 గంటలకు రెండుగేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మరో నాలుగు గేట్లను ఎత్తారు.. కృష్ణ బేసిన్‌లో అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా కనిపిస్తున్నాయ్‌.. ఆల్మట్టి, నారాయణ్‌పూర్ , జూరాల, తుంగభద్ర, శ్రీశైలం.. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో అక్కడి నుంచి వరదంతా ఇప్పుడు నాగార్జున సాగర్‌కి వచ్చి చేరుతోంది. దీంతో.. 2 ఏళ్ల తర్వాత నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. చివరి సారిగా.. 2022 ఆగస్ట్‌ 11 న క్రస్ట్‌గేట్లను ఎత్తారు.. అప్పుడు గేట్లను ఎత్తిన తర్వాత మళ్లీ ఈ రేంజ్‌లో నీళ్లు ప్రాజెక్టులో కనిపించలేదు. వర్షాభావ పరిస్థితులు వచ్చాయి. ఈ సారి వర్షాలు కురవడం, ఎగువనుంచి వరదనీరు పోటెత్తడంతో, అటు శ్రీశైలం, ఇటు నాగార్జునసాగర్‌ నిండుకుండల్లా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సాగర్‌ ప్రాజెక్టులో సరిగ్గా ఉదయం 11 గంటలకు రెండుగేట్లను ఎత్తి, నీటిని దిగువకు విడుదల చేశారు. ఆ తర్వాత మరో నాలుగు గేట్లను ఎత్తారు..



bottom of page