top of page
MediaFx

అభిమానికి సారీ చెప్పిన నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే?


భవిష్యత్ లో అలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా – నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో, అక్కినేని నాగార్జున చివరిసారిగా నా సామిరంగ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత కింగ్ నాగార్జున తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా కింగ్ నాగార్జున సరికొత్త పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది. కింగ్ నాగార్జున కి చేరువలో ఒక అభిమాని రాగా, పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతనిని పక్కకు తీసుకు వెళ్ళాడు. అందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, కింగ్ నాగార్జున ఇలా స్పందించాడు. ఇది నా దృష్టికి వచ్చింది. ఇలా జరగకూడదు. నేను పెద్దమనిషికి క్షమాపణలు చెబుతున్నాను. భవిష్యత్తులో అలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.


bottom of page