‘కల్కి 2898 ఏడీ’ సినిమా గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలక విషయాలు చెప్పారు. ఈ మూవీ ట్రైలర్, రిలీజ్ విషయంలోనూ స్పందించారు. అలాగే, ఓ రూమర్‌పై క్లారిటీ ఇచ్చారు.
సలార్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ భారీ బ్లాక్‍బాస్టర్ కొట్టారు. డిసెంబర్ 1వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం పాన్ వరల్డ్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ప్రభాస్ చేస్తున్నారు. ఇప్పటికే వచ్చిన ‘గ్లింప్స్’ ఈ మూవీపై ఉన్న అంచనాలను ఆకాశాన్ని తీసుకెళ్లాయి. ప్రతిష్టాత్మక సాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్‍లో గ్లింప్స్ లాంచ్ అయిన తొలి భారతీయ చిత్రంగానూ ఈ మూవీ రికార్డు సృష్టించింది. సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రంగా ‘కల్కి 2898 ఏడీ’ని రూపొందిస్తున్నారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, నాగ్ అశ్విన్ నేడు బాంబే ఐఐటీ టెక్ ఫెస్ట్ ఈవెంట్‍లో పాల్గొన్నారు. ఈ మూవీపై వచ్చిన ప్రశ్నలకు స్పందించారు.
కల్కి 2898 ఏడీ చిత్రం భవిష్యత్తు కాలమైన 2898 సంవత్సరం బ్యాక్‍డ్రాప్‍లో జరుగుతుంది. ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ సృష్టించారు. అయితే, కల్కి చిత్రం ‘నాగి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఉంటుందనే రూమర్లు వస్తున్నాయి. వీటిపై ఈ ‘టెక్ ఫెస్ట్’లో డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ఈ రూమర్లను ఖండించారు.
కల్కి 2898 ఏడీ మూవీ నాగి సినిమాటిక్ యూనివర్స్‌లో భాగం కాదని, స్టాండలోన్ మూవీ అని నాగ్ అశ్విన్ స్పష్టం చేశారు. అంటే కల్కి లైనప్‍లో ఇదొక్క చిత్రమే ఉండే ఛాన్స్ ఉంది.
అలాగే, కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ ఇప్పట్లో వచ్చే ఛాన్స్ లేదని నాగ్ అశ్విన్ చెప్పేశారు. 93 రోజుల తర్వాతే ఈ ట్రైలర్ వస్తుందని అన్నారు. అలాగే, ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయాలనుకుంటున్నది త్వరలోనే చెబుతామని, అయితే కచ్చితమైన తేదీ గురించి ఇప్పట్లో స్పష్టత లేదని అన్నారు. 2024 సంక్రాంతికి కల్కి 2898 ఏడీ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించిన మూవీ యూనిట్ వాయిదా వేసింది. నాగ్ అశ్విన్ మాటలను బట్టి చూస్తే 2024 వేసవిలో ఈ చిత్రం వచ్చేలా కనిపిస్తోంది.
కల్కి 2898 ఏడీ మూవీలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణ్, దిశా పటానీ, పశుపతి కీలకపాత్రలు చేస్తున్నారు. సుమారు రూ.500కోట్లకు పైగా బడ్జెట్‍తో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. గ్లోబల్ రేంజ్‍లో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా మూవీ యూనిట్ నిర్ణయించింది. ఈ మూవీకి సంతోశ్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.🌟🎬🗓️