top of page
Shiva YT

అగ్గిరాజేసిన నారా భువనేశ్వరి వ్యాఖ్యలు.. టీడీపీ, వైసీపీ మధ్య సెటైర్లు, కౌంటర్లు..🗣️

నిజం గెలవాలి పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న నారా భువనేశ్వరి. కుప్పంలో అన్నా క్యాంటిన్ ప్రారంభించారు. ఆ కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు డైలాగ్‌వార్‌కి దారితీశాయి. ఇంతకీ భువనేశ్వరి ఏమన్నారు? వైసీపీ నేతలు ఏం కౌంటర్‌ ఇచ్చారు? టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలివి. కుప్పంలో చంద్రబాబుకు ఈసారి విశ్రాంతి ఇద్దామని.. తాను పోటీలో ఉంటానన్నారామె. అయితే భువనేశ్వరి చేసిన వ్యాఖ్యలను జత చేస్తూ వైసీపీ ట్రోలింగ్‌కు దిగగా.. టీడీపీ కూడా అదే స్టయిల్‌లో కౌంటర్ ఇస్తోంది.

భువనేశ్వరి వ్యాఖ్యల్ని.. మంత్రులు సీరియస్‌గా తీసుకున్నట్టు కనిపించింది. ఎవ్వరి స్టయిల్‌లో వాళ్లు సెటైర్లు విసిరారు. చంద్రబాబు పనైపోయిందని.. భువనేశ్వరి కామెంట్లతో అది నిజమని తేలిపోయిందన్నారు మంత్రి రోజా. కుప్పంలో చంద్రబాబు, భువనేశ్వరినే కాదూ.. టీడీపీ నుంచి ఎవ్వరు నిల్చున్నా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. మేం మొదటి నుంచి చెబుతున్నదే.. భువనేశ్వరి ఇప్పుడు చెప్పారన్నారు మంత్రి జోగి రమేష్‌. ఫైనల్‌గా భువనేశ్వరి సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమయ్యాయి. 🎙️💬

bottom of page