చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. తొలుత ఆయనను హెలికాప్టర్ ద్వారా విజయవాడకు తరలించాలని పోలీసులు భావించారు. అయితే, దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు.
టీడీపీ అధినేత, తన పెదనాన్న చంద్రబాబును అరెస్ట్ చేయడంపై సినీ హీరో నారా రోహిత్ మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... నియంతృత్వం వాస్తవం అయినప్పుడు, విప్లవం ఒక హక్కు అవుతుందని అంటూ విక్టర్ హ్యూగో కొటేషన్ ను కోట్ చేశారు. సమయం వస్తుందని, మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. మరోవైపు చంద్రబాబును రోడ్డు మార్గంలో విజయవాడకు తరలిస్తున్నారు. తొలుత ఆయనను హెలికాప్టర్ ద్వారా విజయవాడకు తరలించాలని పోలీసులు భావించారు. అయితే, దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, తన కమెండో సెక్యూరిటీతో పాటే రోడ్డు మార్గంలో వస్తానని ఆయన స్పష్టం చేశారు. దీంతో, ఆయనను రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. మరోవైపు చంద్రబాబును తరలిస్తున్న రోడ్లపై టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.🔊💬