top of page

పాలిటిక్స్‌ను టచ్ చేస్తూ ప్రతినిధి 2 టీజర్🎥✨

కొన్ని నెలల క్రితం ప్రకటించి అసలు షూటింగ్ జరుగుతుందో లేదోననే తరహాలో మౌనం పాటించిన ప్రతినిథి 2 ఇవాళ హఠాత్తుగా టీజర్ రూపంలో వచ్చి ఆశ్చర్యపరిచాడు. సరిగ్గా పదేళ్ల క్రితం విడుదలైన ప్రతినిథి నారా రోహిత్ కు నటన పరంగానే కాకుండా కమర్షియల్ గానూ మంచి విజయం అందించింది. దానికి కొనసాగింపు కాకపోయినా దాని ఛాయలు కనిపించేలా సీక్వెల్ ని రూపొందించడం ఒక విశేషమైతే దర్శకుడిగా ప్రముఖ యాంకర్ టీవీ5 మూర్తి దీని ద్వారానే డెబ్యూ చేయడం మరో ఆకర్షణ. ఊహించని క్వాలిటీ, కంటెంట్ తో ఒకరకంగా షాక్ ఇచ్చారనే చెప్పాలి.ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొలిటికల్ అజెండా సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. వాటిలో వ్యక్తిగత ఉద్దేశాలు ఎక్కువగా ఉండటంతో జనం ఆదరించడం లేదు. భారీ బడ్జెట్ లో తీసిన థియేట్రికల్ మూవీ అయినా ఓటిటిలో వచ్చిన చిన్న చిత్రమైనా ఒకే ఫలితం వస్తోంది. కానీ ప్రతినిథి 2 ఆ కోవలోకి రావడం లేదు. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, ఓటు విలువను తెలియజేస్తూ, సినిమాటిక్ ఫార్మాట్ లో రూపొందించినట్టు కనిపిస్తోంది. 🎥✨


 
 
bottom of page