top of page
MediaFx

మరోసారి విజయ్‌కు జోడీగా నేషనల్ క్రష్.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్..


టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా కల్కి సినిమాలో నటించాడు విజయ్. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించి మెప్పించాడు. కాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ నిత్యం వార్తలు వినిపిస్తున్నాయి. రష్మిక మందన్న మళ్లీ జంటగా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. వీరిద్దరిని తెరపై కలిపేందుకు టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ ప్లాన్ చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారి జంటగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’. ఆ సినిమాతోనే ఇద్దరూ ఫేమస్ అయ్యారు. ఆ సినిమా రష్మికకు టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఈ సినిమా. ఆ తర్వాత రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’.అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేయాలి. అయితే తర్వాత ఆ పాత్రను మృణాల్ ఠాకూర్‌కి వచ్చింది. ఇప్పుడు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జంటగా నటించనున్నారని టాక్ వినిపిస్తుంది.రాహుల్ దర్శకత్వం వహించనున్న కొత్త సినిమా రాయలసీమ ప్రాంత నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో రష్మిక పాత్ర రాయలసీమ యాసలో మాట్లాడుతుందని తెలుస్తోంది. రష్మిక మందన్న ఇప్పటికే ‘పుష్ప’ సినిమాలో అలాంటి పాత్ర చేసింది. అందుకే రాహుల్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలోరష్మిక మందన్నా అయితే బాగుంటుందని టీమ్ భావిస్తుంది. విజయ్ దేవరకొండ కోసమే ఈ పాత్రకు రష్మిక మందన్న ఒప్పుకుంటుందనే నమ్మకంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి విజయ్ దేవరకొండ కానీ, రష్మిక మందన్న కానీ ఎలాంటి అప్డేట్ రాలేదు. రష్మిక మందన్న ప్రస్తుతం బిజీగా ఉంది. ‘పుష్ప 2’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తుంది. ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘సికిందర్’ వంటి బడా సినిమాల్లోనటిస్తుంది రష్మిక. ఈ ప్రాజెక్టులన్నింటిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


bottom of page