top of page
MediaFx

"నవదీప్ కొత్త అవతారం 'లవ్ మౌళి' - చూడాల్సిన ట్రైలర్!"

మళ్ళీ హీరోగా ‘లవ్ మౌళి’ అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో C స్పేస్, నైరా క్రియేషన్స్ నిర్మాణంలో లవ్ మౌళి సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజయిన లవ్ మౌళి గ్లింప్స్ తో సినిమాపై ఆసక్తి పెంచాడు నవదీప్. నవదీప్ రెండో వర్షన్ తో వస్తున్నాను అని, సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్తున్నాడు ఈ సినిమా గురించి.

తాజాగా లవ్ మౌళి ట్రైలర్ రిలీజ్ చేశారు. నవదీప్ ఓ పెయింటర్, తనకు కావాల్సిన అమ్మాయి, తనకు కావాల్సిన ప్రేమని వెతుక్కుంటూ పలువురు అమ్మాయిలతో ట్రావెల్ చేస్తాడు. ఈ కథాంశంతోనే లవ్ మౌళి సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే నవదీప్ ఈసారి కొంచెం బోల్డ్ కంటెంట్ తో వస్తున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా ఈ లవ్ మౌళి ట్రైలర్ చూసేయండి.

bottom of page