సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు నవదీప్. నెట్టింట ట్రెండ్ అవుతున్న సాంగ్స్, డైలాగ్స్ కు రీల్స్ చేస్తూ సందడి చేస్తుంటాడు. ఇక ఈ హీరోకు ఎక్కడికి వెళ్లినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతుంటాయని అనేకసార్లు చెప్పుకొచ్చాడు. ఇటీవల తన ఇన్ స్టాలో ఓ వీడియో పోస్ట్ చేస్తూ అందరు తనను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారని అన్నాడు. “ప్రతిరోజూ ఇంటికి వెళ్లినా.. ఇన్ కు వెళ్లినా ఒకటే ప్రశ్న. అదెప్పుడూ అని.. చెప్తా.. చెప్తా రేపు చెప్తా.. అది నా పెళ్లి డేట్ అయ్యి ఉండొచ్చు.. లవ్ మౌళి రిలీజ్ డేట్ అయ్యి ఉండొచ్చు. ఎలక్షన్స్ లో నేను నిలబడబోతున్న నామినేషన్స్ డేట్ అయ్యి ఉండొచ్చు. అదేంటో రేపు చెప్తా.. అప్పటివరకు మీరు గెస్ చేయండి ” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఏకంగా పెళ్లి శుభలేఖ షేర్ చేసి షాకిచ్చాడు.
అయితే నవదీప్ షేర్ చేసిన వీడియోలో పెళ్లి శుభలేఖ కనిపించడం నిజమే. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది. శుభలేఖలో పెళ్లి కొడుకు.. పెళ్లి కూతురు వివరాలు కాకుండా.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ లవ్ మౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు. నవదీప్, పంఖురి గిద్వానీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ లవ్ మౌళి. ఏప్రిల్ 19న రిలీజ్ చేస్తున్నట్లు ఆ శుభలేఖలో తెలియజేశాడు. పెళ్లి కొడుకు పేరు దగ్గర నవీదీప్ పేరు.. పెళ్లి కూతురు పేరు స్థానంలో పంఖురి గిద్వానీ పేరు.. ముహుర్తం ప్లేస్ లో సినిమా రిలీజ్ డేట్ ను చూపిస్తూ.. పెళ్లి శుభలేఖ ఎలా ఉంటుందో అచ్చం అలాగే డిజైన్ చేసి లవ్ మౌళి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. నవదీప్ షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. వాటే క్రియేటివ్ బ్రదర్.. నిజాంగానే పెళ్లి శుభలేఖ అనుకున్నామని.. లవ్ మౌళి సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ✨