టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "లెవెన్". ఈ సినిమా ఎప్పుడో మొదలైనప్పటికీ, నిన్నటిదాకా ఎవరికీ తెలియలేదు. సైలెంట్‌గా సినిమా పూర్తి చేసి, నేరుగా టీజర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది టీం.
"లెవెన్" టైటిల్ వినగానే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లే గెలిచిన సంగతి గుర్తుకు వస్తుంది. ఈ నంబర్ మీద చాలా ట్రోల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో.
సినిమా టైటిల్ "లెవెన్" అని పెట్టడంతో, వైసీపీ కౌంటర్‌గానే ఈ పేరు పెట్టారేమో అని కూడా జనాలు అనుకుంటున్నారు. ప్రెస్ మీట్లో కూడా ఇదే విషయం ప్రస్తావించడంతో టీం సభ్యులు నవ్వుతూ స్పందించారు.
నవీన్ చంద్ర వివరణలో, సినిమా ఎప్పుడో మొదలైందని, టైటిల్ కూడా ఎప్పుడో పెట్టారని తెలిపారు. ఈ సినిమాకు ప్రస్తుతం 11 నంబర్ ట్రెండ్‌తో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
లోకేష్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన "లెవెన్" ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ లాగే కనిపిస్తోంది. క్రూరంగా హత్యలు చేసే ఒక కిల్లర్‌ను పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే పోరాటం నేపథ్యంలో నడిచే సినిమా ఇది. టీజర్ ఆసక్తికరంగా సాగి, సినిమాపై అంచనాలు పెంచింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.