top of page

హీరో నవీన్ పొలిశెట్టికి యాక్సిడెంట్!

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ ప్రమాదం షూటింగ్‏లో జరిగిందా ?.. లేదా ? అనేది క్లారిటీ తెలియరాలేదు. నవీన్ పొలిశెట్టికి బైక్ యాక్సిడెంట్ జరిగిందని.. చేతికి ఫ్యాక్చర్ కావడంతో వైద్యులు అతడికి రెండు నెలలు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలుస్తోంది. దీంతో అతడి రాబోయే సినిమా షూటింగ్స్ కు రెండు నెలలు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై నవీన్ పొలిశెట్టి గానీ.. తన టీం గానీ రియాక్ట్ కాలేదు.

 
 
bottom of page