top of page
MediaFx

పదిలో పది సార్లు ఫెయిల్.. 11వ సారి పాసైన యువకుడు.. గ్రామంలో ఊరేగింపు ?


📚 మహారాష్ట్రలోని బీడు గ్రామానికి చెందిన ఓ యువకుడు 11వ సారి పదవ తరగతి పరీక్ష రాసి పాస్ అయ్యాడు! మే 27న విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కృష్ణ ముండే తన చిరకాల కాంక్షను నెరవేర్చుకున్నాడు.నామ్ దేవ్ ముండే కుమారుడు కృష్ణ 2018 నుంచి పదవ తరగతి పరీక్షలు రాస్తూ పాస్ కాలేకపోయాడు. కానీ, తండ్రి నామ్ దేవ్ తన కొడుకుపై విశ్వాసం కోల్పోకుండా ప్రోత్సహిస్తూ వచ్చాడు. చివరకు 11వ సారి పాస్ అయిన కృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.తండ్రి నామ్ దేవ్ తన కొడుకు పాస్ కావడంతో అతన్ని పెళ్లి కుమారుడిలా తయారు చేసి ఊరేగింపు నిర్వహించాడు. గ్రామస్థులు కూడా ఈ వేడుకలో పాల్గొని కృష్ణను ఘనంగా స్వాగతం పలికారు.


bottom of page