రెడ్‌మీ నుంచి కొత్త ఇయర్ బడ్స్..🎧
- Shiva YT
- Feb 16, 2024
- 1 min read
షావోమీ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ఇయర్ బడ్స్‌ను లాంచ్ చేసింది. రెడ్‌మీ బడ్స్ 5 పేరుతో ఈ ఇయర్ ఫోన్స్‌ను తీసుకొచ్చింది. మంచి ఫీచర్లతో, బడ్జెట్ ధరలో వీటిని కంపెనీ తీసుకొచ్చించారు.
ఫ్యూజియర్ వైట్, ఫ్యూజియర్ పర్పుల్, ఫ్యూషియన్ బ్లాక్ కలర్స్‌లో వీటిని లాంచ్ చేశారు. ఈ ఇయర్ బడ్స్ ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌తో పాటు, షావోమీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ ఇయర్ బడ్స్ సేల్ ప్రారంభకానుంది. రెడ్‌మీ బడ్స్5 ధరని రూ. 2,999గా నిర్ణయించారు.
ఇక రెడ్‌మీ బడ్స్ 5 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 5 12.4mm డైనమిక్ డ్రైవర్‌లను అందించారు. 20Hz నుండి 20kHz ఫ్రీక్వెన్సీ పరిధిని కలిగి ఉంది. ఇందులో గోల్డెన్ ఇయర్ టీమ్ ద్వారా బాస్ బూస్ట్, వోకల్ ఎన్‌హాన్స్‌మెంట్, EQ సౌండ్ ఎఫెక్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లను అందించారు. ఈ కొత్త ఇయర్‌బడ్‌లు 46 డెసిబుల్స్ వరకు నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. అంటే ఈ ఇయర్‌బడ్‌లను ఉపయోగిస్తున్నప్పుడు బయటి శబ్ధాలు అస్సలు వినిపించవు. దీంతో యూజర్లు మంచి నాణ్యతో కూడిన సౌండ్‌ను వినొచ్చు.
ముఖ్యంగా ఫోన్ కాల్స్ మాట్లాడే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకోసం షావోమీ ప్రత్యేకంగా యాంటీ విండ్ నాయిస్ అల్గారిథమ్, డ్యూయల్ మైక్రోఫోన్‌లకు ఏఐ నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందించారు.🎶