top of page
MediaFx

ట్రూకాలర్‌లో సరికొత్త ఫీచర్‌..

కాంటాక్టుల్లో లేని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను గుర్తించేందుకు ఉపయోగించే ట్రూకాలర్ (Truecaller).. మరో కొత్త ఫీచర్‌తో ముందుకొచ్చింది. వాట్సప్‌, టెలిగ్రామ్‌ తరహాలో ‘ట్రూ కాలర్‌ వెబ్‌’ను తీసుకొచ్చింది.

దీనిద్వారా మీ మొబైల్‌ను డెస్క్‌టాప్‌ లేదా ల్యాప్‌టాప్‌లోనూ సెర్చ్‌ చేసి గుర్తుతెలియని నంబర్ల వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ట్రూ కాలర్‌ వెబ్‌ సాయంతో ఆండ్రాయిడ్‌ యూజర్లు తమ డివైజ్‌ను ల్యాప్‌టాప్‌ లేదా పీసీకి కనెక్ట్‌ చేయొచ్చు. ఫోన్‌లో వచ్చే ఎస్సెమ్మెస్‌ ఇన్‌బాక్స్‌ను రీడ్‌ చేయొచ్చు. కావాలంటే అక్కడి నుంచే రిప్లై కూడా ఇవ్వొచ్చు. ఏదైనా కాల్‌, మెసేజ్‌ వచ్చినప్పుడు ఫోన్‌ చూడాల్సిన అవసరం లేకుండానే ఇన్‌కమింగ్ కాల్‌ అలాగే మెసేజ్‌ అలర్ట్‌లను డెస్క్‌టాప్‌లో పొందొచ్చు. వెబ్‌కు కనెక్ట్‌ చేయగానే మొబైల్‌లో ఇప్పటివరకు ఉన్న సందేశాలను ట్రూకాలర్‌ సెకన్లలో చూపిస్తుంది.


bottom of page