top of page
MediaFx

గ్రహాంతరవాసులు మన మధ్యే ఉన్నారా? హార్వర్డ్ అధ్యయనం షాకింగ్ విషయాలు

గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తిదాయకమే. అయితే దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్నా ఏలియన్స్‌ జాడకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఈ విశ్వంలో మనుషులు మాత్రమే ఒంటరిగా ఉన్నారా?.. అనే ప్రశ్నకు ఇంకా నిర్దిష్టమైన సమాధానం లేదు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఈ భూమిపై మనుషుల మధ్యే గ్రహాంతర వాసులు కూడా జీవిస్తుండవచ్చునని చెబుతోంది. రూపం మార్చుకొని మనుషుల మధ్యే రహస్యంగా నివసిస్తుండ వచ్చునని అభిప్రాయపడింది. గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యూఎఫ్‌వోలపై (ఎగిరే పళ్లాలు) అధ్యయనం కోసం హార్వర్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ‘హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌’లోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భంలో, చంద్రుడిపై లేదా మనువుల మధ్యే జీవిస్తూ ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది. యూఎఫ్‌వోలు లేదా గుర్తించబడని వైమానిక దృగ్విషయాలు భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలు కావచ్చుననే కోణంలో కూడా అన్వేషిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది. భూమికి అవతల జీవాన్ని నిర్ధారించే ఆధారాలు, సిద్ధాంతాల విషయంలో అవగాహన పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. ‘క్రిప్టోటెర్రెస్ట్రియల్’ పరికల్పనపై తాము దృష్టి సారించామని, భూమి మీద, భూగర్భంలో, పరిసరాల్లో గ్రహాంతరవాసుల జాడపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొంది.

bottom of page