top of page
MediaFx

మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ వస్తోంది.. 10000mAh వంటి పవర్‌ఫుల్‌ బ్యాటరీతో


ప్రస్తుతం టెక్‌ ప్రపంచంలో ట్యాబ్స్‌కి ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓటీటీ స్ట్రీమింగ్ సేవలు అందుబాటులోకి రావడం, గేమ్స్‌కు ఎక్కువగా ఆదరణ పెరగడంతో చాలా మంది ట్యాబ్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సైతం అధునాతన ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. రెడ్‌మీ ప్యాడ్ ప్రో 5జీ పేరుతో ఈ ట్యాబ్‌ను లాంచ్‌ చేయనున్నారు.

తొలుత గ్లోబల్‌ మార్కెట్‌లో లాంచ్‌ కానున్న ఈ ట్యాబ్ ఆ తర్వాత ఇండియన్‌ మార్కెట్లోకి రానుంది. ఇంతకి ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్యాబ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.1 ఇంచెస్‌తో కూడిన 2.5 కే ఎల్‌సీడీ ప్యానెల్‌ సెటప్‌ను అందించారు. 2560×1600 పిక్సెల్ రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్ సొంతం. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందించారు. అలాగే ఈ స్క్రీన్‌ 600 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌ను విడుదల చేస్తుంది. దీంతో సన్‌లైట్‌లోనూ స్క్రీన్‌ క్లియర్‌గా కనిపిస్తుంది.

ఇక ట్యాబ్‌ డిస్‌ప్లే ప్రొటెక్షన్‌ కోసం గొరిల్లా గ్లాస్‌ను అందించారు. ఈ ట్యాబ్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీతో తీసుకొస్తున్నారు. మైక్రో SD కార్డ్ సహాయంతో ఇంటర్నల్‌ మెమోరీని 1.5 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, అలాగే 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 10000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ట్యాబ్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ పింట్‌ సెన్సార్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికిస్తే ఈ ట్యాబ్‌లో Wi-Fi 6, బ్లూటూత్ 5.2, USB టైప్-C 2.0 వంటి ఫీచర్లను అందించారు.

bottom of page