🌏 ఈ రెండు దేశాల మధ్య కొత్త వంతెన.. పర్యాటకానికి ఊపిరిపోయనున్న మోదీ.🌏
- Shiva YT
- Jan 24, 2024
- 1 min read
🚗🌊 పర్యాటక రంగ అభివృద్ధిపై ఫోకస్ చేసిన కేంద్రం భారత్-శ్రీలంక మధ్య కొత్తగా వంతెనను నిర్మించాలని యోచిస్తోంది. ఇందుకోసం 40 వేల కోట్ల రూపాయలను వెచ్చించనుంది.
భారత్‌లోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్‌ను కలిపేలా వంతెన నిర్మాణం చేపట్టాలని మోదీ ప్రభుత్వం యోచిస్తోంది. సముద్రంపై 23 కిలోమీటర్ల పొడవున వంతెన నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే రామేశ్వరం నుంచి శ్రీలంక మధ్య రామసేతు వారధి ఉండగా ధనుష్కోడి.. తలైమన్నార్- శ్రీలంక పాల్క్ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల పొడువున రోడ్డు, రైలు మార్గం నిర్మించాలనేది కేంద్ర ప్రభుత్వ ప్లాన్. 40వేలకోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించారు. కొత్త వంతెన నిర్మాణంతో రెండు దేశాల మధ్య పర్యాటక రంగానికి కొత్త ఊపు వస్తుందని అంచనా వేస్తున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే భారత్- శ్రీలంక మధ్య రోడ్డు, రైలు వంతెనలు నిర్మించే ప్రణాళికపై చర్చలు జరిగాయి. ప్రాజెక్టు ప్రారంభానికి ముందు సాంకేతికత, ఆర్థిక, పర్యావరణం తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని నివేదిక పేర్కొంది. ట్రింకోమలి, కొలంబో ఓడరేవుల అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికి భారతదేశం, శ్రీలంక 2022లో అంగీకరించాయి. 🌊🚅✨