చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ 13 ప్రో, 13 ప్రో+ పేరుతో రెండు ఫోన్‌లను లాంచ్ చేశారు. ఇంతకీ సిరీస్ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ధర విషయానికొస్తే రియల్‌మీ 13 ప్రో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 26,999కాగా, 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 28,999, 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ర రూ. 31,999గా నిర్ణయించారు. ఇక ప్రో+ విషయానికొస్తే 8జీబీ ర్యామ్+256 జీబీ స్టోరేజ్ ధర రూ.32,999, 12 జీబబీ ర్యామ్, 256 జీబీ రూ. 34,999, 12 జీబీ ర్యామ్, 512 జీబీ ధర రూ. 36,999గా నిర్ణయించారు.
ఈ ఫోన్‌ను ఎమరాల్డ్ గ్రీన్, మోనెట్ గోల్డ్ కలర్స్‌లో తీసుకొస్తున్నరు. జులై 31వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతుండగా, ఆగస్టు 6వ తేదీ నుంచి తొలి సేల్ ప్రారంభం కానుంది.
రియల్‌మీ 13ప్రో ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఇందులో 45 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.
కాగా రియల్‌మీ 13 ప్రో+ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. స్నాప్‌డ్రాన్ స్ జెన్2 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 50 ఎంపీ రెయిర్ కెమెరా, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. 80 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5200 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించారు.