top of page
Suresh D

టాలీవుడ్ @ 2024 - ఈ ఏడాది రిలీజయ్యే క్రేజీ చిత్రాలివే!🎥✨

2023 గడిచిపోయింది.. 2024 వచ్చేసింది. గడిచిన ఏడాది కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్నో విజయాలు, అంతకు మించిన అపజయాలు చూసింది. సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు చూసింది.. ఫ్లాపులు, అట్టర్ ఫ్లాపులు, బిగ్గెస్ట్ డిజాస్టర్లు చవి చూసింది. అయితే ఇప్పుడు ఎన్నో ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతోంది. సినీ ప్రియులకు అసలైన సినీ వినోదాన్ని అందించడానికి రెడీ అయింది. ఈ సంవత్సరం మనం గతంలో ఎన్నడూ చూడని భారీ బాక్సాఫీస్ క్లాష్ చూడబోతున్నాం. సంక్రాంతి పండుగ మొదలుకొని క్రిస్మస్ సీజన్ వరకూ అనేక క్రేజీ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. ఆ సినిమాలేంటో ఒకసారి చూద్దాం! 

2024 సంక్రాంతి ఫైట్ మామూలుగా ఉండదు🎥✨
  • సంక్రాంతి సీజన్ తో అసలు సిసలైన సినిమా పండుగ ప్రారంభం కానుంది. ఈసారి 5 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి.

  • సూపర్ స్టార్ మహేష్ బాబు - డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ 'గుంటూరు కారం' జనవరి 12న రిలీజ్ అవుతోంది.

  • అదే రోజున ప్రశాంత్ వర్మ 'హనుమాన్' అంటూ అదృష్టాన్ని పరీక్షించుకోడానికి వస్తున్నాడు.

  • కింగ్ అక్కినేని నాగార్జున పొంగల్ సెంటిమెంట్ తో బరిలో దిగుతున్నారు. కొత్త దర్శకుడితో కలసి 'నా సామి రంగ' అంటూ వస్తున్నారు.

  • విక్టరీ వెంకటేష్ తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించిన 'సైంధవ్', మాస్ మహారాజా రవితేజ చేసిన 'ఈగల్' చిత్రాలు కూడా ఇదే ఫెస్టివల్ సీజన్‌లో పోటీ పడుతున్నాయి. వీటిల్లో ఏయేవి ఆడియన్స్ ను అలరించి 2024కు గ్రాండ్ వెల్కమ్ చెప్తాయో చూడాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.

వేసవిలో అసలు సిసలైన సినీ వినోదం🎥✨
  • యంగ్ టైగర్ ఎన్టీఆర్ - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' సమ్మర్ లో రానుంది. మొదటి భాగం ఏప్రిల్ 5న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది.

  • ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కలయికలో రూపొందుతున్న 'పుష్ప' పార్ట్ 2 సినిమా కూడా ఈ ఏడాదే రాబోతోంది. 2024 ఇండిపెండెన్స్ డేకి విడుదల అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించేశారు.

  • రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కలిసి 'కల్కి 2898 AD' సినిమాతో సినీ అభిమానులకు ఓ సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నారు. దీంతో పాటుగా మారుతి దర్శకత్వంలో డార్లింగ్ మూవీ కూడా రెడీ అవుతోంది. 

  • మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా షో మ్యాన్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా 'గేమ్ ఛేంజర్' కూడా 2024 లోనే రానుంది.

  • రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' గా ప్రేక్షకులని పలకరించనున్నాడు.

  • ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'OG' సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  • యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, చందు మొండేటి కలిసి 'తండేల్' చిత్రంతో సముద్రం మీదకు వేటకు వెళ్తున్నారు.

  • బాలయ్య - బాబీ కాంబోలో తెరకెక్కుతున్న NBK109 మూవీ కూడా ఈ ఏడాదే రానుంది. నేచురల్ స్టార్ నాని 'సరిపోదా శనివారం' అంటూ వస్తున్నాడు.

ఇలా ఈ సంవత్సరంలో అనేక క్రేజీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. గతేడాది స్క్రీన్ మీద కనిపించని స్టార్ హీరోలు ఈసారి ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టబోతున్నారు. మొత్తం మీద ఈ ఏడాది భారీ చిత్రాలలో చాలా క్రేజీగా మారబోతోందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీటిల్లో ఏవేవి మంచి సక్సెస్ సాధిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 🎥✨

bottom of page