బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుళ్ల నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐ) అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
తెలంగాణ పోలీసుల సహకారంతో నిందితుల ను పట్టుకున్నారు. అబ్దుల్ మతీన్, ముసవీర్ హుస్సేని కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ, కేరళ, కర్ణాటక పోలీసుల సహకారంతో నిందితుడ్ని పట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. పేలుడు కేసులో కోల్‌కతాకు చెందిన అబ్దుల్ మతిన్‌ను మాస్టర్ మైండ్‌గా గుర్తించినట్టు చెప్పారు. పేలుడుకి కుట్రధారిగా మతిన్ వ్యవహరించాడని పేర్కొన్నారు. మతిన్ ఆదేశాల మేరకు ముసవీర్‌తో కలిసి మరో ఇద్దరు పేలుళ్లకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలింది.రామేశ్వరం కేఫ్‌లో పేలుడు తర్వాత అసోం, కోల్‌కతాలో నిందితులు తలదాచుకున్నారు.
నకిలీ పత్రాలు సృష్టించుకుని వేషాలు మార్చి, పోలీసులను ఏమార్చినట్టు వెల్లడించారు. పేలుడు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎన్ఐఏ.. కేంద్ర నిఘా వర్గాలు, కేరళ, పశ్చిమ్ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక పోలీసుల సహకారంతో ఆపరేషన్ చేపట్టింది. మార్చి 1న రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు ఘటనలో కనీసం 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. అయితే, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.