తాజాగా నిహారిక కొణిదెల తన కమిటీ కుర్రోళ్లు వెబ్ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొని మీడియా ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. బన్నీని తేజ్ అన్ ఫాలో చేశాడనే విషయంపై ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.
నిహారిక వెబ్ సిరీస్‌లు నిర్మిస్తూ, నటిస్తూ ఎంత బిజీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె తాజా వెబ్ మూవీ "కమిటీ కుర్రోళ్లు" టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ లాంచ్ ఈవెంట్లో నిహారిక చిన్న స్పీచ్ ఇచ్చినా, మీడియాతో మాత్రం బాగానే మాట్లాడింది.
ఎన్నికల రిజల్ట్స్ తరువాత బన్నీ మీద జరిగిన ట్రోలింగ్ అందరికీ తెలిసిందే. మెగా వర్సెస్ అల్లు టాపిక్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ అల్లు వారందరినీ అన్ ఫాలో చేశాడు. ఈ సంఘటనతో మెగా, అల్లు మధ్య ఉన్న గొడవల గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
ఇదే అంశం మీద నిహారికకు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. తేజ్ అలా బన్నీని అన్ ఫాలో చేశాడని తనకు తెలియదని నిహారిక చెప్పింది. అయితే అలా చేసి ఉంటే, అందరి రీజన్స్ వాళ్లకి ఉంటాయని తెలివిగా సమాధానం ఇచ్చింది. అంటే నిహారిక ఈ కోల్డ్ వార్ గురించి చెప్పీ చెప్పనట్టే చెప్పింది. మెగా, అల్లు మధ్య గొడవలు లేవని మాత్రం చెప్పలేదు, అంటే గొడవలున్నాయని ఒప్పుకున్నట్టే కనిపిస్తోంది.