అంబానీ పెళ్ళిలో సందడి..🎉🤵♂️
- Shiva YT
- Mar 2, 2024
- 1 min read
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లికి సంబందించిన కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వివాహ వేడుకలు జామ్‌నగర్‌లో జరుగుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు.
అంబానీ ఇంట పెళ్లి అంటే ప్రపంచ నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరవుతారు. ఈ వేడుకలకు ఆహ్వానాలు అందినవారిలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, ఎంఎస్ ధోనీ తదితరులు ఉన్నారు. వ్యాపార దిగ్గజాల్లో మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌పాటు అనేక మంది ప్రముఖులు రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అతిథులకు ఏకంగా 2,500 వంటకాలను వడ్డించనున్నారట.
ఈ వివాహానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ హాజరయ్యారు. ప్రముఖ క్రికెటర్ డ్వేన్ బ్రావోతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు షారుఖ్. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్వేన్ బ్రావోకు భారత్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అతను ఐపీఎల్‌లో CSK జట్టులో ఆడుతున్నాడు. షారుఖ్ తోపాటు రణవీర్ సింగ్‌తో కూడా పోజులిచ్చాడు బ్రావో.
షారుఖ్ ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, మాధురీ దీక్షిత్, వరుణ్ ధావన్, అనిల్ కపూర్, సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్, అనన్య పాండే తదితరులు ఈ వివాహానికి హాజరయ్యారు. రణవీర్ సింగ్, రాణి ముఖర్జీ, దీపికా పదుకొణె కూడా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసన ఈ వేడుకలకు హాజరయ్యారు. అనంత్ అంబానీ పెళ్లికి విదేశాల నుంచి సింగర్స్ వచ్చారు. బార్బడోస్‌కు చెందిన రిహాన భారత్‌కు వచ్చింది. ఆమె ఇండియాలో ప్రోగ్రాం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆమె ఒక్కరోజు ఫీజ్ 74 కోట్ల రూపాయలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 🌟💑🌍