నోకియా.. ఒకప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌ను ఏలిన సంస్థ మళ్లీ వినియోగదారులను ఆకర్షిస్తోంది! సుమారు 20 ఏళ్ల క్రితం నోకియా మొబైల్ ఫోన్ మార్కెట్లో అగ్రగామిగా కొనసాగింది. ముఖ్యంగా ఫీచర్ ఫోన్ అనగానే నోకియా గుర్తొచ్చేద్ది. ఆండ్రాయిడ్ ఫోన్ల హవా తర్వాత నోకియా విండోస్ ఫోన్స్ తీసుకొచ్చింది. కానీ, ఆండ్రాయిడ్‌కు వచ్చిన ఆదరణ విండోస్ ఫోన్లకు లభించలేదు. ఇప్పుడు, నోకియా మళ్లీ ఫీచర్ ఫోన్లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో పడింది.
నోకియా బ్రాండ్‌పై ఫోన్లను తయారు చేసే హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నోకియా 3210 4జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. 25 ఏళ్ల క్రితం ఇదే పేరుతో లాంచ్ అయిన మోడల్‌ను నోకియా మరోసారి తీసుకొస్తోంది. ఈసారి ఫోన్‌కు ఆధునిక ఫీచర్లను జోడించారు. ఫోన్ ధర రూ. 3,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమెజాన్‌తో పాటు హెచ్ఎండీ ఈ స్టోర్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంది.
ఈ ఫోన్‌ను నీలం, పసుపు, నలుపు రంగుల్లో అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికొస్తే, ఈ ఫోన్లో 2.4 ఇంచెస్ క్యూవీజీఏ డిస్ప్లే ఉంది. ఇందులో యునిసోక్ టీ107 ప్రాసెసర్‌ను అందించారు. 2 మెగాపిక్సెల్స్ కెమెరా, 64 ఎంబీ ర్యామ్ ఉంది. నోకియా ఐకానిక్ స్నేక్ గేమ్ కూడా ఉంది. యూఎస్బీ టైప్ సీ పోర్టు, 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. కనెక్టివిటీకి 3.5 ఎంఎం జాక్, ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయల్ సిమ్ 4జీ voLTE ఫీచర్లు ఉన్నాయి. ఫీచర్ ఫోన్ అయినప్పటికీ యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ కోసం వేర్వేరు యాప్స్ ఉన్నాయి.