top of page
MediaFx

ఈ పిల్లల్ని గుర్తు పట్టారా? చిన్ననాటి ఫోటో వైరల్! 🤔✨

సినిమా పజిల్స్ భలే ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఆ హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఈ హీరో ఎవరో చెప్పండి’.? అంటూ రకరకాల పజిల్స్ సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. జనాలు కూడా ఈ పజిల్స్ ను సాల్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రోజువారీ పనుల నుంచి కాస్త రిలాక్స్ అవ్వడం కోసం కొంతమంది ఈ పజిల్స్ ను సాల్వ్ చేస్తూ ఉంటారు. చిన్నతనం లో యాడ్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉండేవి.. 90’s కిడ్స్ కు ఈ యాడ్స్ గుర్తుండే ఉంటాయి. అప్పట్లో కాంప్లాన్ యాడ్ చాలా ఫెమస్.. కాంప్లాన్ తాగితే పొడవు పెరుగుతారు అంటూ యాడ్స్ వచ్చేవి. చాలా మంది అది నిజమే అనుకునేవారు. ఐయామ్ ఏ కాంప్లాన్ బాయ్ అంటూ ఆ యాడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేది. ఆ యాడ్ లో నటించిన చిన్నారులు గుర్తున్నారా.?ఆ ఇద్దరూ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్స్, ఆ యాడ్ లో అన్న చెల్లెళ్లుగా నటించిన ఆ ఇద్దరూ హీరో, హీరోయిన్ గా సినిమాలు కూడా చేశారు. ఇంతకు పై ఫొటోలో ఉన్న ఇద్దరూ ఎవరో కనిపెట్టరా.? ఆ అబ్బాయి ఎవరో కనిపెట్టడం కొంచం ఈజీనే కానీ హీరోయిన్ ను మాత్రం అంత ఈజీగా గుర్తుపట్టలేరు. ఇంతకు ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ ఎవరంటే.. పై ఫొటోలో కనిపిస్తున్న వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్.అలాగే ఆ చిన్నారి హాట్ బ్యూటీ అయేషా టాకియా. షాహిద్ కపూర్ హీరోగా బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ కు కూడా చేస్తున్నాడు. అలాగే అయేషా టాకియా బాలీవుడ్ లో సినిమాలు చేసింది. తెలుగులో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాలో మెరిసింది. ఆతర్వాత తెలుగులో నటించలేదు. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యింది. అయేషా, షాహిద్ కలిసి దిల్ మాంగే మోర్ అనే సినిమాలో నటించారు. ఇప్పుడు ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

bottom of page