top of page
MediaFx

పవన్‌తో అంత వీజీ కాదు..


పవన్ కళ్యాణ్ రాజకీయ సభల్లో అప్పుడప్పుడూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు.. సవాళ్లు చేస్తుంటాడు కానీ.. ఆయనకు కక్ష సాధింపు రాజకీయాలు ఇష్టముండదని.. పనిగట్టుకుని ఎవరినీ టార్గెట్ చేయడని అంటారు.

ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ వాళ్ల మీద ప్రతీకార దాడులు జరుగుతుంటే.. వాటిని నివారించడానికే పవన్ చూశాడు. ఒకటికి రెండుసార్లు అలాంటి చర్యలకు వెళ్లొద్దని టీడీపీ, జనసేన వాళ్లకు పిలుపునిచ్చాడు. తాజాగా పిఠాపురంలో కూడా ప్రతీకార దాడులు వద్దనే చెప్పాడు.

అలా అని పవన్ అన్నింటినీ చూసీ చూడనట్లు వదిలేస్తాడా.. వైసీపీ పార్టీలోని అక్రమార్కులకు చెక్ పెట్టకుండా ఉండిపోతాడా అంటే.. సమాధానం కాదనే అనిపిస్తోంది. కాకినాడలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఇందుకు ఉదాహరణ.

అధికారంలో ఉండగా ద్వారంపూడి ఆగడాలు ఒకటీ రెండు కాదు. కాకినాడలో ఆయన అక్రమాలు, దౌర్జన్యాల గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఇక ఆయన నోటి దురుసు గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒక పబ్లిక్ మీటింగ్‌లో పవన్‌ను ‘లం..కొడకా’ అని తిట్టిన అథమ స్థాయి ఆయనది. అలాంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదనే అభిప్రాయం జనసేన, టీడీపీ మద్దతుదారుల్లో ఉంది.

ఐతే పవన్ పదే పదే ప్రతీకార చర్యలు వద్దని వారిస్తుంటే.. ఇలాంటి వాళ్లను కూడా వదిలేస్తారనే అనుకున్నారు. కానీ గ్రౌండ్లో జరిగింది వేరు. కాకినాడలో ద్వారంపూడి బినామీ అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని కూల్చి వేయించడం అందులో భాగమే. ఈ సందర్భంగా అధికారులు, పోలీసులను అడ్డుకోవడానికి ద్వారంపూడి ఎంతో ట్రై చేశారు. అధికారం కోల్పోయిన విషయాన్ని మరిచిపోయి దౌర్జన్యం చేయబోయారు. కానీ ఆయన్ని అక్కడి నుంచి పోలీసులు లాక్కెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గ

తంలో ద్వారంపూడి పని పడతానని.. అధికారంలోకి వచ్చాక ఆయన్ని, తన అనుచరుల్ని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తామని.. తోలు ఒలిచేస్తామని పవన్ గతంలో చేసిన హెచ్చరికను గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. పవన్‌తో అనుకున్నంత ఈజీ కాదని.. చట్టబద్ధంగానే ప్రత్యర్థులకు డిప్యూటీ సీఎం చుక్కలు చూపించడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నారు.

bottom of page