top of page
MediaFx

పరోటా షాపుకు పోటెత్తిన కుర్రాళ్ళు..తినడం కోసంమాత్రం కాదు..


రోడ్డు పక్కన ఓ అమ్మాయి రకరకాల పరోటాలు అమ్ముతుంది. చూస్తే పెద్ద క్యూ ఉంది. అరటిపండు పరోటా, ఎగ్ పరోటా అంటూ డిఫరెంట్ పరోటాలు అమ్ముతోంది ఆ అమ్మాయి. అయితే జనాలు అంతగా పోటెత్తేది పరోటాల కోసం అని అనుకుంటే మీరు ఎగ్గులో లెగ్గు వేసినట్టే.. మాములుగా పరోటాలు వేసే వారు ఎలా ఉంటారో మనకు ఓ అంచనా ఉంటుంది. కానీ ఇక్కడ పరోటాలు అమ్ముతుంది ఓ అమ్మాయి. పైగా అందాలు ఆరబోస్తూ ఆ పరోటాలు చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తుంది. స్టైలీష్ లుక్‌లో బోల్డ్ డ్రెస్సింగ్ స్టైల్‌లో పరోటాలు అమ్ముతుంది ఆమె. దాంతో ఆమెను చూడటానికి కుర్రాళ్ళు క్యూ కడుతున్నారు. ఆమె అందాన్ని చూస్తూ అలా ఉండిపోతున్నారు. ఇంత అందమైన అమ్మాయి ఇలా పరోటాలు అమ్మితే ఆ మాత్రం క్యూ ఉంటుంది అని నెటిజన్స్ ఈ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఈ అమ్మాయి అందం ముందు హీరోయిన్స్ పనికిరారు అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.



bottom of page