top of page
Shiva YT

అతని మ్యూజిక్ కి మనుషులే కాదు పక్షులు కూడా మెస్మరైజ్ కావాల్సిందే..🎶🐦

సంగీతం అంటే ఇష్టం ఉండని వారు ఎవరుంటారు. చాలామంది మంచి సంగీతాన్ని ఆస్వాధిస్తారు. మంచి సంగీతాన్ని వింటే మనసుకు హాయిని కలిగిస్తుందని నమ్ముతుంటారు.

మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు సంగీతం వినేందుకు ఇష్టపడతారు. కొందరు శాస్త్రీయ సంగీతం వినడానికి ఇష్టపడితే, మరికొంతమందికి సినిమా సంగీతాన్ని వినడానికి ఇష్టపడతారు. అలాగే ఈ మధ్యకాలంలో పక్షులు కూడా సంగీతాన్ని వినేందుకు ఇష్టపడతున్నాయి. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ అది నిజం. దీనికి సంబంధించిన ఓ వీడియో ఈ మధ్యకాలంలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పక్షులు మ్యూజిక్ ని వినేందుకు వచ్చి గిటారిస్ట్ దగ్గర కూర్చుంటాయి.

పార్స్లో ఒక వ్యక్తి ఆనందంతో గిటార్ వాయిస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఇక్కడ గిటారిస్ట్ ప్లే చేస్తున్న మ్యూజిక్ వినుకుంటూ పక్షులు చాలా సేపు అక్కడే ఉండిపోయాయి. ఆ తర్వాత గిటారిస్ట్ చేతి మీద వచ్చి కూర్చుంది. ఈ దృశ్యాన్ని చూసి, అక్కడ నిలబడి ఉన్నవారు దాన్ని రికార్డ్ చేయడం ప్రారంభించారు. ఈ దృశ్యం నిజంగా చాలా మనోహరమైనది. ఈ వీడియో ఇన్స్టాలో ప్యూబిటీ అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేశారు. 🎸🎥


bottom of page