top of page
Suresh D

వాట్సాప్‌లో ఇక హెచ్‌డీ ఫొటోలు కూడా షేర్ చేయొచ్చు..📸📲

మన ఫోన్ లోని నాణ్యత కలిగిన కెమెరా సాయంతో అందమైన ఫొటోలు తీసినప్పటికి వాటిని వేరొకరికి పంపినప్పుడు వాటి నాణ్యత తగ్గిపోతుంది. ముఖ్యమైన ఫొటోలను బంధుమిత్రులు, స్నేహితులకు పంపడానికి సాధారణంగా వాట్సాప్ ను ఉపయోగిస్తాం. అయితే దానిద్వారా ఫొటోలను వేరొకరికి పంపినప్పుడు క్వాలిటీ తగ్గిపోతుంది. దీంతో ఎంత అందమైన ఫొటోలైనా వేరొకరి వద్దకు వెళ్లేసరికీ డల్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో హై-డెఫినిషన్ (హెచ్ డీ) లో ఫొటోలు, వీడియోలను పంపడానికి వాట్సాప్ కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. దీనిద్వారా నాణ్యత తగ్గకుండా వేరొకరికి షేర్ చేయవచ్చు. వాట్సాప్ తీసుకువచ్చిన ఈ కొత్త అప్ డేట్ తో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.📸📲


bottom of page