top of page
MediaFx

ఆఫీస్ మీటింగ్ కి మొదటిసారి హాజరైన యువతి.. సూపర్ హిట్ సాంగ్ కు డ్యాన్స్..


ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకునేవి డ్యాన్స్ , సాంగ్స్ వీడియోలు. వీటికి బాషతో పని లేదు.. కంటెంట్ ఉంటె చాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుని అత్యంత ప్రజాదరణ పొందిన వీడియోలు ప్రసిద్ది చెందుతున్నాయి. ఇందుకు సంబంధించిన లెక్కలేనన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ఆఫీస్ మీటింగ్‌లో ఓ యువతి భాగ్ మిల్కా భాగ్ చిత్రంలోని ఓ రంగ్రేజ్ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియోను అంజలి పట్వాల్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పట్వాల్ ఆఫీస్ మీటింగ్ రూమ్‌గా కనిపిస్తుంది. ఆ గదిలో చాలా మంది నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. మీటింగ్ కోసం సహోద్యోగులు ఉన్నారు. వీరిలో కొందరు వర్చువల్‌గా కనెక్ట్ అయ్యారు. అప్పుడు ఓ యువతి “ఓ రంగ్రేజ్” పాటకు మనోహరంగా డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ చేయడం ముసిగినప్పుడు ఆ యువతి చుట్టూ ఉన్న వారి చప్పట్లు కొట్టి అభినందించారు. వీడియోపై ఉన్న టెక్స్ట్ లో మీరు మీ రెజ్యూమ్‌లో ‘డ్యాన్స్’ చేయడం మీ అభిరుచి అని రాస్తే.. అప్పుడు మీ మొదటి టీమ్ మీటింగ్ ఇలా సాగుతుంది అని ఉంది.” పోస్ట్ చేసినప్పటి నుంచి వీడియో ఎనిమిది మిలియన్లకు అంటే 80 లక్షలకు పైగా వ్యూస్ ను అనేక లైక్‌లు సొంతం చేసుకుంది. అంతేకాదు వీడియోకు రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి మీటింగ్స్ లో మాకు మరింత సృజనాత్మకత అవసరం అని ఒకరు వ్యాఖ్యానించారు. మరొక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు “ఇంక్రిమెంట్ కోసం వాడే టెక్నిక్… అయితే తాను బారాత్ సమయంలో మాత్రమే డ్యాన్స్ చేస్తానని అది కూడా నాగినీ సంగీతం ప్లే చేస్తేనే అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. గతంలో తాను పని చేసిన సంస్థలో ఇలాంటివి జరిగినప్పుడల్లా.. తాను తన కుర్చీలో అతుక్కుని పోయి కూర్చునే వాడిని అని చెప్పారు. అసలు ఆఫీసు లో మీటింగ్ లో ఉద్యోగులు, ఆఫీసర్స్ ముందు ఇలా డ్యాన్స్ చేయాలంటే దైర్యం ఉండాలని కామెంట్ చేసారు మరొకరు.



bottom of page