తెలుగు నటి చాందినీ చౌదరి తన తదుపరి చిత్రాన్ని ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'యేవమ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రం జూన్ 14న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని సెకండ్ సింగల్‌ని "ఒగ్గు కథ" అనే టైటిల్ తో విడుదల చేసారు.
"యేవమ్" చిత్రాన్ని నటుడు నవదీప్ యొక్క సి స్పేస్ మరియు ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో చాందినీ తో పాటు అషు రెడ్డి మరియు భరత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తనా శేష్ మరియు నీలేష్ మందలపు ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో మూవీ మేకర్స్ వెల్లడి చేయనున్నారు.