top of page
MediaFx

‘ఓం భీమ్ బుష్’ OTT స్ట్రీమింగ్ డేట్ ఇదే..

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్. డైరెక్టర్ శ్రీ హర్ష దర్శకత్వం వహించిన ఈ హరర్ కామెడీ ఎంటర్టైనర్ లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలకపాత్రలు పోషించారు. మార్చి 22న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈసినిమా మొదటి రోజే సూపర్ హిట్ టాక్ అందుకుంది. దాదాపు 10 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. చాలా కాలం తర్వాత ప్రేక్షకులను థియేటర్లలలో ఉన్నంతసేపు నవ్వించింది ఈ మూవీ. ఇక థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ సినిమాను ఏప్రిల్ 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుందని టాక్ వినిపించింది. ఇక ఇదే విషయంపై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది.

ఈ సినిమాను ఏప్రిల్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన తేదీ కంటే ముందే ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. ఇక ఇన్నాళ్లు థియేటర్లలో ఈ మూవీ కామెడీని మిస్ అయిన అడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఎంజాయ్ చేయొచ్చు. లాజిక్ తో సంబంధం లేకుండా మంచి కథతో పాటు అంతకు మించిన కామెడీతో రెండున్నర గంటలపాటు ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది.

కథ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రాణ స్నేహితులు కాగా.. వీరిని ఊరంతా బ్యాంగ్ బ్రోస్ అనిపిస్తుంటారు. భైరవపురం అనే ఊరిలో డబ్బుల కోసం సైంటిస్టులుగా కొత్త నాటకం స్టార్ట్ చేస్తారు. అయితే వీరిపై సందేహంతో ఎలాగైనా వీరి గురించి తెలుసుకోవాలనుకున్న ఊరి ప్రజలు వీరి ముగ్గురికి ఓ పరీక్ష పెడతారు. అలాగే ఆ ఊర్లో ఉన్న సంపంగి మాల్లో ఉన్న నిధిని కనిపెట్టాలనుకుంటారు ఈ ముగ్గురు స్నేహితులు. ఆ సమయంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది మూవీ.

bottom of page