డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు:
చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొత్తి మీర, కరివేపాకు, ఆయిల్, ఉల్లిపాయలు, పెరుగు, పచ్చి మిర్చి, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి.
డిఫరెంట్ స్టైల్ చికెన్ ఫ్రై తయారీ విధానం:
ముందుగా చికెన్‌ని శుభ్రంగా క్లీన్ చేసుకుని.. కొద్దిగా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి.. ఓ రెండు గంటల సేపైనా మ్యారినేట్ చేసుకోవాలి. టైమ్ లేని వారు నేరుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆ తర్వాత చికెన్ వేసి కలపాలి. ఇప్పుడు పెరుగు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చికెన్‌లో ఉండే వాటర్ అంతా పోయేదాకా.. ఆయిల్ పైకి తేలేంత వరకూ చికెన్ కుక్ చేసుకోవాలి. ఆ నెక్ట్స్ ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. మధ్య మధ్యలో చికెన్ కలుపుతూ.. మెత్తగా, కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఈ సమయంలో కొత్తి మీర తప్పించి.. మిగిలిన అన్ని పదార్థాలు వేసి.. ఓ రెండు నిమిషాల పాటు బాగా వేయించాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే ఎంతో రుచిగా ఉంటే చికెన్ ఫ్రై సిద్ధం. కావాలి అనుకునే వారు నిమ్మ రసం కూడా పిండుకోవచ్చు. ఇలా ఫ్రైతో అన్నం తిన్నా లేక రసంతో తిన్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి.