top of page
MediaFx

బడ్జెట్‌ ధరలో వన్‌ప్లస్‌ ఫోన్‌.. ఇంత తక్కువ బడ్జెట్‌లో..🚀

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్‌ బ్రాండ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వన్‌ప్లస్‌ నుంచి కొత్త ఫోన్‌ వస్తుందంటే టెక్‌ మార్కెట్లో ఆసక్తినెలకొంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మొదట్లో వన్‌ప్లస్‌ ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లో ఫోన్‌లను తీసుకొస్తూ యూజర్లను పెంచుకుంటూ పోతోంది. ఈ క్రమంలోనే ఇటీవల వరుసగా పలు ఫోన్‌లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా వన్‌ప్లస్‌ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్‌ మార్కెట్లోకి వస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 4 లైట్‌ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌ను బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండే అవకాశం ఉంది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇప్పటికే వన్‌ప్లస్‌ ఈ ఫోన్‌కు సంబంధించి బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) నుంచి ధృవీక‌ర‌ణ స‌ర్టిఫికెట్ అందుకున్న‌ట్లు సమాచారం.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌కు కొనసాగింపుగా ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 ఎస్‌ఓసీ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో డ్యూయల్‌ రెయిర్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఇందులో ఇన్‌-డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్స‌ర్‌ను ఇవ్వనున్నారు. బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

ఇక ఈ ఫోన్ ధరను రూ. 20 వేలలోపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేయనుందని సమాచారం. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించానున్నారు. త్వరలోనే కంపెనీ ఈ ఫోన్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది.

bottom of page