ఎమ్మెల్యే లాస్య నందిత మృతి, కారు ప్రమాదంపై కేసు నమోదయింది. ఆమె సోదరి నివేదిత ఫిర్యాదుతో పటాన్‌చెరు పీఎస్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్ 304 ఏ కింద నందిత పీఏ ఆకాష్‌పై కేసు పెట్టారు.
ఉదయం 5గంటల 15 గంటలకు ఆకాష్ ఫోన్ చేశాడని, ప్రమాదం జరిగి.. ఇద్దరికీ దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడని కంప్లైంట్‌లో రాశారు నివేదిత. తాము వెళ్లి చూసేసరికి స్పాట్‌లో నుజ్జునుజ్జు అయి కారు మాత్రమే ఉందని చెప్పారు. ప్రస్తుతం మియపూర్ లోని ఓ ప్రైవేటు హాస్పటల్ లో ఆకాష్ చికిత్స పొందుతున్నాడు.. అతను కోలుకున్నాక విచారిస్తామని పటాన్ చెరువు పోలీసులు తెలిపారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు, ఆర్టిఏ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతేకాకుండా.. ప్రమాదం జరిగిన చోట క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించారు. షామీర్ పెట్ లో ఔటర్ రింగ్ రోడ్డుపై కి కారు ఎంట్రీ అయినట్టు గుర్తించామన్నారు. ఆకాష్ నిద్ర మత్తులోకి జారిపోవడం వల్లనే ప్రమాదం జరిగినట్టు చెప్తున్నప్పటికీ.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 🚔👮
లాస్య నందిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. కుటుంబసభ్యులు, ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. పోలీసులు వాస్తవాలను వెలుగులోకి తేవాలని కోరారు బండి సంజయ్. 🗣👥
అతివేగంతో కారు నడపడంతోనే ప్రమాదం జరిగిందన్నారు సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ సంజీవరావు. ప్రమాదం జరిగిన సమయంలో లాస్య కొన ఊపిరితో ఉన్నారని, ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో చనిపోయారన్నారు. లాస్య ప్రయాణిస్తున్న కారు.. ముందున్న వాహనాన్ని ఢీకొట్టిన తర్వాత.. అదుపుతప్పి ORR పక్కన రెయిలింగ్‌ను ఢీకొట్టినట్లు గుర్తించామన్నారు ఏఎస్పీ.. 🚑👨⚕️
సదాశివపేటలోని ఓ దర్గాలో మొక్కులు చెల్లించడానికి ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులతో వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొచ్చి.. కుటుంబ సభ్యులను ఇంటి దగ్గర దింపిన తర్వాత.. టిఫిన్ కోసం సంగారెడ్డికి వెల్దామని బయటికి వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. ప్రమాదంలో లాస్య పీఏ ఆకాష్ కాళ్ళు విరిగాయని.. అతడికి ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స కొనసాగుతోందన్నారు పోలీసులు.. 🚑