వేగంగా విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ 4జీ..
ప్రైవేటు టెలికాం ఆపరేటర్లతో పోల్చితే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ల రేట్లు కూడా తక్కువగా ఉండటం కూడా వినియోగదారులను ఆకర్షిస్తోంది. పైగా బీఎస్ఎన్ఎల్ కూడా 4జీ సేవలను విస్తరించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 1000కి పైగా ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ తన 4జీ సేవలను విస్తరించింది. దీంతో ప్రైవేటు ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్ కు పోర్టయ్యే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ క్రమంలో బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ అమ్మకాల్లో మంచి ఆఫర్లు అందిస్తోంది. కొత్త సిమ్ తీసుకునే వారు మంచి ఫ్యాన్సీ నంబర్ల కోసం ప్రయత్నిస్తున్నారు. మరీ బీఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నంబర్లను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్యాన్సీ నంబర్ కావాలంటే..
బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ తీసుకునే సమయంలో మీకు ఫ్యాన్సీ నంబర్ కావాలంటే ఈ విధంగా చేయాలి.. మొదట గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఓపెన్ చేసి.. మీరు డైరెక్ట్ గా ఈ వెబ్ సైట్ పై క్లిక్ చేయొచ్చు లేదా.. BSNL choose your mobile number అని సెర్చ్ చేసి.. బీఎస్ఎన్ఎల్ cymn లింక్ పై క్లిక్ చేసినా ఆ పేజీ ఓపెన్ అవుతుంది. తర్వాత జోన్ ను ఎంపిక చేసుకోవాలి. తర్వాత రాష్ట్రం పేరు ఎంపిక చేసుకోవాలి.
ఆ తర్వాత మీకు ఫోన్ నంబర్ల సిరీస్ కనిపిస్తాయి. మొదటి నంబర్, చివరి నంబర్, మొత్తం కూడినప్పుడు వచ్చే నంబర్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
వాటిల్లో మీకు నచ్చిన నంబర్ ను ఎంపిక చేసుకొని రిజర్వ్ నంబర్ పై క్లిక్ చేయాలి.
ఆ తర్వాత ప్రస్తుతం మీరు వినియోగిస్తున్న మొబైల్ నంబర్ ను ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు ఓటీపీ వస్తుంది. దీంతో ఆ నంబర్ మీకు కోసం రిజర్వ్ అవుతుంది.
ఆ తర్వాత మీ దగ్గరలో ఉన్న బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లడం ద్వారా ఆ ఫ్యాన్సీ నంబర్ తో కూడిన సిమ్ కార్డును పొందొచ్చు.
ఆ సిమ్ ను మీరు ఎంచక్కా ఫోన్లో వేసుకొని వినియోగించుకోవచ్చు. ఈ సిమ్ కార్డుల కొనుగోలుపై బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లను కూడా అందిస్తోంది. చవకైన 4జీ సేవలను సైతం అందిస్తోంది.