సింగరేణిలో ఉద్యోగాల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం..🌐
- Shiva YT
- Mar 2, 2024
- 1 min read
Updated: Mar 4, 2024
తెలంగాణలోని కొత్తగూడెంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. సింగరేణి బొగ్గు గనుల సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. 📑 మొత్తం 272 ఎగ్జిక్యూటివ్ కేడర్/ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. 🌐 ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 1 నుంచి 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 📅
పోస్టుల వివరాలు.. 📋 ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టుల వివరాలు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (మైనింగ్), ఈ2 గ్రేడ్ పోస్టులు: 139 మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్ అండ్ ఎ), ఈ2 గ్రేడ్ పోస్టులు: 22 మేనేజ్‌మెంట్ ట్రైనీ (పర్సనల్), ఈ2 గ్రేడ్ పోస్టులు: 22 మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఐఈ), ఈ2 గ్రేడ్ పోస్టులు: 10 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్ పోస్టులు: 10 మేనేజ్‌మెంట్ ట్రైనీ (హైడ్రో-జియాలజిస్ట్), ఈ2 గ్రేడ్ పోస్టులు: 2 మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్), ఈ2 గ్రేడ్ పోస్టులు: 18 జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్, ఈ1 గ్రేడ్ పోస్టులు: 3 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఈ3 గ్రేడ్ పోస్టులు: 30 నాన్-ఎగ్జిక్యూటివ్ కేడర్‌లో సబ్-ఓవర్సీర్ ట్రైనీ (సివిల్), టి అండ్ ఎస్ గ్రేడ్-సి పోస్టులు: 16 ఆయా పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ బీఎస్సీలో ఇంజినీరింగ్, సీఏ/ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ / డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎంబీఏ / ఎంఎస్సీ / ఎంబీబీఎస్ / డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 🎓 వైద్యాధికారి పోస్టులకు మినహా మిగిలిన అన్ని పోస్టులకు గరిష్ట వయోపరిమితిపి 30 ఏళ్లుగా నిర్ణయించారు. ⌛ వైద్యాధికారి పోస్టుల (జీడీఎంవో పోస్టులు)కు 45 ఏళ్లుగా గరిష్ట వయోపరిమితిని ఇచ్చారు. 🧑⚕️ మిగిలిన అన్ని పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు ఇచ్చారు. 📚 రిక్రూట్‌మెంట్ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 📝 ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. 📄