top of page
MediaFx

బీసీసీఐ అవకాశమిస్తేనే నెక్స్ట్ సీజన్‌లో తలా ఎంట్రీ.!


చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్, బీసీసీఐ తీసుకునే నిర్ణయంపైనే ధోనీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఎందుకంటే ఐపీఎల్‌ 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనుంది. దీంతో చాలామంది ఆటగాళ్లు వేలంలోకి రానున్నారు. అయితే, ఫ్రాంఛైజీలు ఎంతమందిని రిటైన్‌ చేసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఒక్కో ఫ్రాంఛైజీ అయిదుగురు లేదా ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకొనే అవకాశం కల్పిస్తేనే వచ్చే సీజన్‌లో ధోనీ ఆడటానికి ఛాన్స్‌ ఉంటుందని సమాచారం. ఆటగాళ్ల రిటెన్షన్‌పై బీసీసీఐ తీసుకునే నిర్ణయం కీలకమవనుందని తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ ఆరంభానికి ముందు మెగా వేలం జరగనుంది. అయితే నిలుపుదల చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను 5 నుంచి 6కు పెంచాలని ఐపీఎల్ ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరుతున్నాయి. మరి ఇందుకు బీసీసీఐ అనుమతిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్న ఆటగాళ్ల జాబితాలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, మతీశ పతిరన, శివమ్ దూబే ఉన్నట్టు సమాచారం. కాగా జులై 31న ముంబైలో ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులతో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేసింది. ఆటగాళ్ల రిటెన్షన్ నిబంధనలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. కాగా 5 నుంచి 6 మంది ఆటగాళ్లను నిలుపుదల చేసుకునేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వొచ్చని పలు కథనాలు పేర్కొంటున్నాయి.

bottom of page