భారత జట్టుకు దూరమైనప్పటి నుంచి తన ఐపీఎల్ రిటైర్మెంట్‌పై అభిమానులను ఊరిస్తున్నాడు. ప్రతీ సీజన్‌లోనూ ధోనీకి ఇదే చివరి టోర్నీ అని ప్రచారం జరగ్గా.. అతను మాత్రం ఇప్పుడు కాదంటూ ముందుకు కొనసాగుతున్నాడు. సొంత అభిమానుల సమక్షంలో వీడ్కోలు పలకాలని ఉందని, గత సీజన్ ముందు వెల్లడించాడు.
అందుకు తగ్గట్లుగానే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్సీ చేశాడు. దాంతో ఐపీఎల్ 2024 సీజన్‌లో సీఎస్‌కే ఆడే చివరి మ్యాచే ధోనీకి ఫేర్‌వెల్ గేమ్ అని అంతా అనుకున్నారు. కానీ ధోనీ ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా ఆ సీజన్‌ను ముగించాడు. ఈ ఏడాది చివర్లో మెగా వేలం జరగనున్న నేపథ్యంలో ధోనీ కొనసాగడంపై సర్వత్రా ఆసక్తినెలకొంది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ సైతం ధోనీ తన రిటైర్మెంట్‌కు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొంది. అతన్ని రిటైన్ చేసుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని తెలిపింది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ.. అభిమానులతో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ప్రశ్నించగా ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ 2025కి ఇంకా చాలా సమయం ఉంది. ఆటగాళ్ల రిటెన్షన్ విషయంలో బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందోనని మేం ఎదురు చూస్తున్నాం. ప్రస్తుతం బంతి నా ఆధీనంలో లేదు. మెగా వేలానికి సంబంధించిన రూల్స్, నింబంధనలు రాగనే.. ఐపీఎల్ 2025లో కొనసాగే విషయంపై నా నిర్ణయాన్ని ప్రకటిస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా.. అది జట్టుకు మేలు చేసేలానే ఉంటుంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో 'Thala for a reason' ట్రెండ్ అవ్వడంపై కూడా ధోనీ స్పందించాడు. తనకు కూడా ఆ విషయం తెలియదని, ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఇదంతా తన అభిమానుల గొప్పదనమని తెలిపాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకున్నా.. వారు తనపై ప్రేమను చూపిస్తున్నారని, వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. సోషల్ మీడియాలో తాను చేయాల్సిన పనులన్నీ ఫ్యాన్స్ చేస్తున్నారని తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.