సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మ్యాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా లావిష్ స్కేల్‌లో నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘హరోంహర’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
చాలా కాలం తర్వాత హీరో సందీప్ కిషన్ నటించిన సినిమా ‘ఊరు పేరు భైరవకోన ‘. డైరెక్టర్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. నిన్న ఉదయం నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. ఇప్పటివరకు సందీప్ కెరీర్లోనే వన్ ఆఫ్ ది హిట్ మూవీగా నిలిచింది ఈ సినిమా. మొదటి రోజే భారీ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ దాదాపు రూ. 6.3 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నైజాం ఏరియాలో కోటిన్నర వరకు ఈమూవీ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, పాటలతో మూవీపై అంచనాలను క్రియేట్ చేసింది చిత్రయూనిట్. దీంతో అటు ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరిగింది. సందీప్ కెరీర్ లోనే అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల్లో ఇది ఒకటి. దాదాపు 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. 🎬🎉