top of page

ఓపెన్ చేయగా నల్లటి ఆకారం..

MediaFx

ఒక నాగుపాము వాషింగ్ మెషీన్‌లోపల పడగ విప్పి కూర్చుంది. ఆ ఇంట్లోవారు వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేయడానికి వెళ్ళినప్పుడు, లోపల కూర్చున్న పాము కనిపించింది. అది పడగవిప్పి అతనిని భయపెట్టింది. పడగవిప్పి నిలబడి, అతనిపైకి పదే పదే నాలుక బయటకు పెడుతూ కాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ బెదిరిస్తోంది. దాంతో కంగురుపడ్డ అతను వెంటనే స్నాక్ క్యాచర్, రెస్క్యూ టీమ్‌కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్‌ క్యాచర్ 5 అడుగులకు పైగా పొడవున్న నాగుపామును వాషింగ్ మెషీన్ లోంచి బయటకు తీశారు. దాన్ని సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలాడు. కాగా, ఇంటర్‌నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియోని కోట నగరానికి చెందిన ఒక వ్యక్తి షేర్‌ చేశారు. వీడియో చూసిన ప్రజలు ఈ ఘటనతో భయపడిపోయారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోని వాషింగ్ మెషీన్‌లను ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. మరికొందరు స్పందిస్తూ రేపటి నుండి బట్టలు ఉతకడం మానేయండి అంటున్నారు. పాపం మూగజీవి బయట కాలుష్యం భరించలేక.. కడుక్కోవడానికి ఇలా ఆ ఇంటికి వచ్చిందేమో అంటూ ఒకరు రాశారు. బయట అధిక వేడి కారణంగా అది ఇలా వాషింగ్‌ మెషీన్‌లోకి వెళ్లి ఉండవచ్చని ఇంకొకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.



bottom of page