వాతావరణ మార్పులు, చల్లటి వాతావరణంలో చల్లటి పదార్థాలు తినడం వల్ల మనకు జలుబు రావడం కామన్. కానీ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కూడా త్వరగా జలుబు చేస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజులో కనీసం 7 గంటల కంటే తక్కువ నిద్ర ఉన్నవారికి త్వరగా జలుబు వచ్చే అవకాశం ఉంటుందని రిపోర్టులు చెబుతున్నారు.
ఆలాగే తక్కువ సమయం నిద్రపోయే వారిలో మెదడు పనితీరుపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. టెక్నాలజి యుగంలో దూసుకపోతున్న నేటితరానికి నిద్రపై శ్రద్ధ చాలా తగ్గిపోయింది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఎట్టి పరిస్థితుల్లో 8 గంటల నిద్ర తప్పనిసరి అని ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి.
ఎక్కువ నిద్ర తక్కువ నిద్ర రెండు ఆరోగ్యానికి మంచివి కావనీ చాలా అధ్యయనాలు తెలిపాయి. తక్కువ నిధులతో బాధపడుతున్న వారిలో చాలావరకు మధుమేహం బిపి హార్ట్ ఉబకాయం వంటి బీద కాలిక వ్యాధుల భారిన పడి ఇబ్బందులు పడుతున్నారని ఒక రిపోర్ట్.
ఇందులో ఇంట్రెస్టింగ్గా ఒక సర్వే రిపోర్ట్ ఏంటంటే.. కనీసం ఏడు గంటలకంటే ఎక్కువ నిద్రపోయే వారి కంటే కూడా ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోయే వారికి జలుబు త్వరగా వస్తుందని ఒక అధ్యయనం తెలిపింది. నిద్ర సరిగ్గా లేనివారికి ఆకలి పుట్టించే హార్మోన్ గ్రేలిన్ ఎక్కువగా విడుదలై ఆకలి ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందని కడుపు నిండిందనే భవన కల్పించే హార్మోన్ లెప్టిన్ తక్కువగా విడుదలై మరింత ఆహారం తినే విధంగా చేసి ఉబకాయానికి దారితీస్తుందని మరొక అధ్యాయం తెలిపింది.
నిద్రలేమి ప్రభావం మెదడు పనితీరుపై కూడా ఉందని పరిశోధకులు అంటున్నారు. ప్రతిరోజు మెదడులో కొన్ని వ్యర్థ కణాలు పెరుగుతాయని.. నిద్రపోయినప్పుడు అవి తొలగిపోతాయని పరిశోధకులు అంటున్నారు. అందుకే మనిషికి సరిపడా నిద్ర లేకపోతే ఆ వ్యక్తకణాలు మెదడులో పేరుకుపోయి.. మెదడు పనితీరుపై ప్రభావం చూపుతాయని పరిశోకులు స్పష్టం చేస్తున్నారు.