రోజులు మారాయి సరే. మరి రాజకీయాలు మారాయా? మార్పే లక్ష్యమన్న పవన్ కల్యాణ్.. రాజకీయాలను మార్చారా? రాజకీయాలకు అనుగుణంగా తాను మారారా? పవర్ కిక్కు సరే.? డైలాగుల లెక్క ఏంటి? అన్నది హాట్ టాపిక్‌గా మారిందిప్పుడు. అందుకు కారణం రాజకీయంలో నోటు స్వామ్యంపై ఆయన నోటి నుంచి వచ్చిన మాటలే. జీరో బడ్జెట్ పాలిటిక్స్ వర్కవుట్ అవ్వట్లేదన్నారు. క్యాష్‌లెస్ పాలిటిక్స్ వచ్చేలా మార్పు రావాలి.. కావాలన్నారు. ఓటుకు తీసుకునే నోటు గుడిమెట్ల కాడ బిచ్చంకు సరిపోదనే పోలిక తూకం వేశారు కూడా. ఇదంతా అప్పట్లో.. మరి ఇప్పుడు భీమవరం వేదికగా పాలిటిక్స్‌లో మనీ రోల్‌పై భీమ్లా నాయక్ మన్ కీ బాత్ ఇలా తెరపైకి వచ్చింది. 🗣️💰
పాలు, నీళ్ల లెక్క.. డబ్బు,.. ఇది ఎప్పటినుంచో వున్న మాటే. అలా కాదు మార్పు రావాలన్న పవన్ కూడా చివరకు అదే ఒపీనియన్‌కు ఫిక్సయ్యారంటే. పైసా మే పాలిటిక్స్ అనేంతగా పవన్ మారారా? నోటు ఇచ్చి ఓటు కొనమన్నట్టా? వద్దన్నట్టా? రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లా ఉండాలంటారుగా. ఆ లెక్కన మార్పు అబద్దమేనా.? ఇప్పటికైతే అందరం ఇలాంటి అబద్దపులోకంలోనే బతుకుతున్నాం భవిష్యత్‌లోనైనా ఈ రాజకీయాలు మారితే మంచిదనేది తాజా పవనోపదేశం. డబ్బు లేని పాలిటిక్స్ రావాలన్న పవన్.. ఇప్పుడు మాత్రం ఓటు కొంటారో లేదో మీ ఇష్టం అని సందేశం ఇవ్వడం దేనికి సంకేతం? ఒకప్పుడు డబ్బు రాజకీయాలను పవన్ అసహ్యించుకన్నది నిజం. మరిప్పుడు ఈ మార్పు వెనుక కారణం ఏంటి? పాలిటిక్స్‌లో మనీ పాయింట్ ఆయనలో మార్పు తెచ్చిందా? 💸🔄